మాముందు కేసీఆర్ ఓ బచ్చా: షబ్బీర్ అలీ
Add ap7am to your home Screen

మాముందు కేసీఆర్ ఓ బచ్చా: షబ్బీర్ అలీ

  • తెలంగాణ తల్లి సోనియాగాంధీనే
  • ఇదే విషయాన్ని అసెంబ్లీలో కేసీఆర్ కూడా చెప్పారు
  • అడుగడుగునా అందరినీ మోసం చేసిన వ్యక్తి కేసీఆర్
తెలంగాణ తల్లి సోనియాగాంధీనే అని... ఇది తాము చెబుతున్న మాట కాదని, అసెంబ్లీలో సాక్షాత్తు కేసీఆరే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఏపీని కోల్పోతామని తెలిసి కూడా తెలంగాణను ఇచ్చిన గొప్ప వ్యక్తి సోనియా అని కితాబిచ్చారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత మోసం చేశారని విమర్శించారు.

ఉత్తర తెలంగాణలోనే టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. అడుగడుగునా అందరినీ మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. 70 ఏళ్లు పాలించిన అనుభవం తమకు ఉందని.. తమ అనుభవం ముందు కేసీఆర్ బచ్చా అని షబ్బీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళతారని చెప్పారు.
shabbir ali
kcr
sonia gandhi
congress
TRS

More Telugu News