మంత్రి నారా లోకేశ్ సిగ్గులేకుండా పట్టపగలు అబద్ధాలు చెబుతున్నారు!: వైసీపీ నేత రోజా
- చంద్రబాబు ఆస్తులు రూ.2.9 కోట్లేనా?
- ఎలా నవ్వాలో చెబితే నవ్వుతాం లోకేశ్
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే
ఈ రోజు ట్విట్టర్ లో రోజా స్పందిస్తూ.. ‘చంద్రబాబుకి రూ.2.9 కోట్లు ఆస్తి అంట, రూ.5.31 కోట్ల అప్పులంట.. ఎలా నవ్వాలో చెప్తే నవ్వుతాం లోకేశ్ బాబు. మీ జన్మలో నిజాలు చెప్తే తలలు వెయ్యి ముక్కలు అవుతుంది అనే సామెతను నిజం చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అని కొంచెం కూడా సిగ్గు లేకుండా పట్టపగలు పచ్చి అబద్ధాలు ఎలా ఆడుతున్నారు?’ అని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను రోజా షేర్ చేశారు.