చెక్కును వదిలేసి వెళ్లిన రవీంద్ర జడేజా... చెత్తబుట్టలో సఫాయి కార్మికుడికి దొరికింది!
- తిరువనంతపురంలో ఐదో టీ-20
- విండీస్ పై గెలిచిన టీమిండియా
- ప్రజెంటేషన్ చెక్కు చెత్తబుట్టలోకి
దీన్ని ఫోటో తీసిన 'ప్రకృతి' అనే స్వచ్ఛంద సంస్థ ఫేస్ బుక్ లో పెట్టగా అది వైరల్ అయింది. "ఈ చెక్కుల కోసం దయచేసి ప్లాస్టిక్ ని వినియోగించ వద్దు" అని బీసీసీఐని కోరింది. కాగా, ఈ చెక్కు జయన్ అనే సఫాయి కార్మికుడికి దొరకగా, 'ఇప్పటికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జయన్' అంటూ 'ప్రకృతి' పోస్టు చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇండియా, సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.