నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణమదే: హాస్యనటి గీతా సింగ్
- మా అన్నయ్య పిల్లల బాధ్యత నాదే
- వాళ్లు ఇప్పుడు చదువుకుంటున్నారు
- వాళ్లను వదిలేయలేక పెళ్లి చేసుకోలేదు
"మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు .. ఆ తరువాత ఆయన చనిపోయాడు. అప్పటి నుంచి కూడా ఆ ఇద్దరి పిల్లల పోషణ భారాన్ని నేనే చూస్తున్నాను. వాళ్ల చదువు విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి సాయం లభించింది. నేను పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలను వదిలేయమంటారు .. వాళ్ల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. నా విషయంలో ఇలా జరిగితే నా పిల్లలను మా అన్నయ్య చూసుకునేవాడు. అలాంటి అన్నయ్య పిల్లలను వదిలేయలేకనే నేను నా పెళ్లి గురించి ఆలోచించలేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.