అంబటి రాయుడు అనూహ్య నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై
- పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి
- వన్డే ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా నిర్ణయం
- తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ఇప్పటి వరకు టీమిండియా తరపున ఒక్క టెస్టూ ఆడని రాయుడు, ఇకపైనా టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్, ఆ తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రాయుడు టెస్టుల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు తన అండగా ఉన్న హెచ్‌సీఏ, సహచర ఆటగాళ్లకు రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు.