'వర్షం' సినిమాలో మార్చిన ఆ సీన్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వర్షం' సినిమాలో మార్చిన ఆ సీన్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది: పరుచూరి గోపాలకృష్ణ

  • నేరుగా విలన్ రంగంలోకి దిగుతాడు
  • హీరో .. విలన్ అక్కడ కొట్టుకోకూడదు 
  • అందుకే ఫైట్ సీన్ ను ఆ విధంగా మార్చాము  
'వర్షం' సినిమా ప్రభాస్ ను స్టార్ హీరోగా చేసేసింది. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను గురించి 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. 'ఈ సినిమాలో ఫైట్ పక్కనే మరో ఫైట్ వచ్చింది ఆర్డర్లో. ప్రభాస్ పెట్రోల్ బంక్ దగ్గర వున్నప్పుడు నేరుగా గోపీచంద్ వచ్చేస్తాడు. అంటే విలన్ నేరుగా రంగంలోకి దిగిపోతాడు. ఇక ఈ ఇద్దరూ ఇక్కడ కొట్టేసుకుంటే సినిమా అయిపోతుంది .. అందువలన కొట్టుకోకూడదు.

హీరో .. విలన్ అక్కడ తలపడకుండా ఎలాంటి సీన్ క్రియేట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచించి, ఫైట్ సీన్ అనుకున్న దానిని ఉత్కంఠభరితమైన సీన్ గా మార్చాము. ప్రభాస్ దగ్గరికి గోపీచంద్ వచ్చి 'శైలు'ను మర్చిపొమ్మంటాడు. అప్పుడు ప్రభాస్ పెట్రోల్ తో అందరినీ తడిపేసి లైటర్ వెలిగిస్తాడు. 'శైలు' కోసం నేను పదిసార్లు చస్తాను .. నువ్వొక్కసారి చావగలవా?' అని అడుగుతాడు. దాంతో గోపీచంద్ వెనక్కి తగ్గి తన అనుచరులతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ లైటర్ తో ప్రభాస్ సిగరెట్ వెలిగించుకుంటాడు. యూత్ ను ఈ సీన్ ఎంతగానో ఆకట్టుకుంది" అని చెప్పుకొచ్చారు.   
prabhas
trisha

More Telugu News