Andhra Pradesh: ఆంధ్రా ప్రత్యేక హోదాను సినిమాతో పోల్చుతారా?: పవన్ కల్యాణ్ పై మంత్రి లోకేశ్ ఆగ్రహం

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించడంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈరోజు తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కొందరు సినిమాతో పోల్చడం దారుణమని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే జాతీయస్థాయిలో కొన్నిపార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ట్విట్టర్ లో ఈ రోజు పవన్ కామెంట్లకు లోకేశ్ సమాధానమిచ్చారు.

బీజేపీని ఓడించేందుకు ఏర్పాటు చేస్తున్న జాతీయ కూటమిని ఓ ఫ్లాప్ షోగా పవన్ అభివర్ణించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సీరియస్ విషయాలను కొందరు వ్యక్తులు సినిమాలతో పోల్చడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Pawan Kalyan
Nara Lokesh
Jana Sena
Telugudesam
Congress
alliance
flop show
Special Category Status
Chandrababu

More Telugu News