దీపావళి తర్వాత కాంగ్రెస్ జాబితా విడుదల.. కాంగ్రెస్ 95, మిత్రపక్షాలు 24 స్థానాల్లో పోటీ
- సోనియా నివాసంలో సమావేశం
- 8-9 తేదీల్లో అభ్యర్థుల జాబితా విడుదల
- 57 స్థానాలపై ఏకాభిప్రాయం
తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గాను 95 స్థానాల్లో కాంగ్రెస్, 14 స్థానాల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిపి పది స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇక, కాంగ్రెస్ పోటీ చేయనున్న 95 స్థానాల్లో 57 స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 8, లేదంటే 9న జాబితా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.