అలా ఎలా జరిగిందబ్బా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!
- అనంతపురం కలెక్టరేట్ ఎదుట వ్యక్తిపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్
- బాధితుడికి చిన్న గాయం కూడా కాని వైనం
- తాజాగా బయటపడి వైరల్
ట్రాక్టర్ కాస్తా ముందుకు వెళ్లగానే ఆ వ్యక్తి నిదానంగా లేచి దులుపుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను కేకేసి గొడవకు దిగాడు. ట్రాక్టర్ పై నుంచి వెళ్లినప్పటికీ చిన్నగాయం కూడా కాకుండా బయటపడిన అతడిని చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు. పోలీసులు ఇటీవల ఇక్కడి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అతడి అదృష్టానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.