జగన్ కత్తి దాడి నుంచి తప్పించుకోగానే శ్రీనివాసరావు మమ్మల్ని బ్రతిమాలాడు!: వైసీపీ నేత ఐజయ్య
- అతడిని కొట్టొద్దని జగన్ సూచించారు
- అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది
- దాడి సమయంలో నేనక్కడే ఉన్నా
వైఎస్ జగన్ పై దాడి విఫలం కావడంతో ‘నన్ను కొట్టొద్దు.. నన్ను కొట్టొద్దు.. పోలీసులకు అప్పగించండి’ అని శ్రీనివాసరావు వేడుకున్నాడని ఐజయ్య తెలిపారు. అప్పుడు జగన్ కూడా ‘అతనిపై ఎవ్వరూ చేయి చేసుకోవద్దు. పోలీసులకు అప్పగించండి’ అని చెప్పారన్నారు. ప్రథమ చికిత్స అనంతరం, టీటీ ఇంజెక్షన్ తీసుకుని జగన్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారని తెలిపారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై దాడి ఘటనపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.