అఖిల్ నాల్గొవ సినిమా బోయపాటితోనే
- 'మిస్టర్ మజ్ను'తో బిజీగా అఖిల్
- తదుపరి మూవీగా యాక్షన్ ఎంటర్టైనర్
- స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న బోయపాటి
బోయపాటి తన దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో, రెండు మూడు నెలల్లోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలననే నమ్మకంతో వున్నాడట. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన అఖిల్ తో చేయనున్నాడనీ, నాగార్జున కోరిక మేరకు బోయపాటి కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.