dhavaleswaram: ‘సీఎం..సీఎం’ అంటూ పవన్ అభిమానుల నినాదాలు.. పవన్ ఆసక్తిర వ్యాఖ్యలు!

షార్ట్స్‌లో చూడండి
సీఎం పదవి తనకు అలంకారం కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ధవళేశ్వరం వద్ద ఈరోజు నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతుండగా, ‘సీఎం..సీఎం’ అంటూ అభిమానులు నినదించారు. ఈ నినాదాలపై స్పందించిన పవన్ స్పందిస్తూ, ‘మీరు చేసే నినాదం సత్యమై తీరుతుంది’ అని అన్నారు.

వారసత్వాలతో సీఎంలు కాలేరంటూ నారా లోకేశ్, వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. తమ తాత, తండ్రీ సీఎంలు కనుక తానూ ముఖ్యమంత్రిని అవుతానని లోకేశ్, తన తండ్రి సీఎంగా చేశారు కనుక తానూ ఆ పదవిని పొందాలన్న జగన్ లా తనకు వారసత్వం లేదని అన్నారు. ఒక కానిస్టేబుల్ గా తన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొడుకు ఈ రాష్ట్రానికి సీఎం ఎందుకు కాలేడు, కచ్చితంగా అవుతాడంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు.    
Go Back to Shorts
dhavaleswaram
Pawan Kalyan
Jana Sena

More Telugu News