నేను ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో సభ్యుడిని కాదు: గద్దర్ వివరణ
Add ap7am to your home Screen

నేను ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో సభ్యుడిని కాదు: గద్దర్ వివరణ

  • రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే కేసీఆర్ పై పోటీ చేస్తా
  • ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నా పోటీ ఉంటుంది
  • త్వరలో అన్ని రాజకీయపార్టీలను కలుస్తా
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ని కలిసేందుకు వెళ్లిన ప్రజాగాయకుడు గద్దర్ ఆ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. రాహుల్ ని కలిసిన అనంతరం, మీడియాతో గద్దర్ మాట్లాడుతూ, తాను ఏ పార్టీలో చేేరలేదని, ఏ పార్టీలో సభ్యుడిని కాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే కనుక గజ్వేల్ లో కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని చెప్పారు. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా తన పోటీ ఉంటుందని, త్వరలో అన్ని రాజకీయపార్టీలను కలుస్తానని వివరించారు. కాగా, ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని గద్దర్ కుటుంబం కలవనున్నట్టు సమాచారం.
gaddar
delhi
congress

More Telugu News