NTR: తొలి దక్షిణాది లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి పాత్రలో రకుల్... 'ఎన్టీఆర్'లో రకుల్ లుక్ ఇదిగో!

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ తొలిభాగం 'కథానాయకుడు'లో శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తుండగా, తొలి ఫస్ట్ లుక్ ను చిత్రం టీమ్ విడుదల చేసింది. నేడు రకుల్ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ తో శ్రీదేవి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

దక్షిణాది చిత్ర సీమలో తొలి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి, హీరోలతో సమానంగా పారితోషికం పొందిన నటి శ్రీదేవి. ఇక ఈ చిత్రంలో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ లో బాలయ్య, రకుల్ జోడీ కనిపిస్తుందని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ ఇలా కనిపించనుంది. 
Go Back to Shorts
NTR
BIopic
Rakulpreet Singh
Balakrishna
Sridevi

More Telugu News