స్నేహితులే శత్రువులయ్యారు...కోహ్లీ, ధావన్‌ సతీమణులు ఢీ అంటే ఢీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్నేహితులే శత్రువులయ్యారు...కోహ్లీ, ధావన్‌ సతీమణులు ఢీ అంటే ఢీ

  • విభేదాలు తార స్థాయికి చేరినట్లు వార్తలు
  • టెస్ట్‌ జట్టుకు ధావన్‌ని దూరం పెట్టడమే కారణమని సమాచారం
  • ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేసిన శిఖర్‌ భార్య
ఇద్దరూ మంచి స్నేహితులు. భర్త మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తుంటే గ్యాలరీలో కూర్చుని చప్పట్ల వర్షంతో వారిని ప్రోత్సహించే వారిద్దరూ. పరస్పరం అభినందించుకుంటూ పొంగిపోయే వారు. ఇంతలోనే ఏమైందో స్నేహితులు కాస్తా శత్రువులయ్యారు. ఎడమొహం పెడమొహంగా తిరుగుతున్నారు. భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కొహ్లీ భార్య అనుష్కశర్మ, ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ సతీమణి అయేషా ముఖర్జీ మధ్య చెడిందన్న వార్తలు ఇప్పుడు ప్రచార మాధ్యమాల్లో గుప్పుమంటున్నాయి.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వెస్టిండిస్‌ జట్టుతో ఆడే టెస్ట్‌ జట్టులో శిఖర్‌ ధావన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. తన భర్తకు చోటు దక్కకపోవడానికి అనుష్కనే కారణమని అయేషా భగ్గుమంటోందట. జట్టు అంతర్గత సమావేశాలకు కూడా హాజరయ్యే అనుష్క చేసిన మతలబు వల్లే ధావన్‌ జట్టులో స్థానం కోల్పోయాడన్న కోపంతో ఉన్న అయేషా, అనుష్కకు కటీఫ్‌ చెప్పేసిందంటున్నారు.

అయితే ‘అవన్నీ గాలి వార్తలే. మా మధ్య ఎటువంటి గొడలు లేవు. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమే’ అంటూ కొట్టిపారేసింది అయేషా ముఖర్జీ.  బీసీసీఐ కూడా ఈ వార్తలను ఖండించింది. కానీ అనుష్క శర్మ మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు.
Cricket
Anushka Sharma
ayesha mukharjee

More Telugu News