181 పరుగులకే చాపచుట్టేసిన విండీస్... ఫాలో ఆన్ ఆడిస్తున్న ఇండియా!
- 48 ఓవర్లలో ఆలౌట్
- 17 పరుగులతో నాటౌట్ గా నిలిచిన బిషో
- మరికాసేపట్లో రెండో ఇన్నింగ్స్ ఆడనున్న వెస్టిండీస్
విండీస్ బ్యాటింగ్ లో బ్రాడ్ వైట్ 2, పావెల్ 1, హోప్ 10, హెట్ మేయర్ 10, ఆంబ్రిస్ 12, చేజ్ 53, డౌరిచ్ 10, పాల్ 47, ల్యాయిస్ 0, గాబ్రియేల్ 1 పరుగు సాధించగా, బిషో 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 18 ఎక్స్ ట్రాలు కలిపి విండీస్ స్కోరు 181 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ కు 4 వికెట్లు దక్కగా, షమీకి 2, ఉమేష్, జడేజా, కుల్ దీప్ లకు తలో వికెట్ లభించాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే, 449 పరుగులు చేయాల్సిన వెస్టిండీస్, ఆ టార్గెట్ ను చేరుకోలేకపోయింది. దీంతో మరికాసేపట్లో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.