అచ్చం సచినే... అరంగేట్రంలోనే అదరగొడుతూ హాఫ్ సెంచరీ చేసిన పృధ్వీ షా!
- మైదానంలో మరో సచిన్ ను గుర్తు చేస్తున్న పృధ్వీ షా
- ప్రశంసలు కురిపిస్తున్న సీనియర్లు
- 56 బంతుల్లోనే 50 పరుగులు
తొలి ఓవర్లోనే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటైనా, ఆ ప్రభావాన్ని తనపై పడ్డట్టు ఏ క్షణమూ కనిపించని పృధ్వీ, టెస్టు మ్యాచ్ ని వన్డేలా ఆడాడు. కేవలం 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పృధ్వీకి మరో ఎండ్ లో ఉండి సహకారాన్ని అందిస్తున్న ఛటేశ్వర్ పుజారా, ప్రస్తుతం 38 పరుగులు చేశాడు. భారత స్కోరు ప్రస్తుతం 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు.