River Ganga: పవిత్ర గంగానదిలో స్నానం చేస్తున్న మహిళ.. బయటకు లాక్కొచ్చి సామూహిక అత్యాచారం!

  • గంగానది చెంత రెచ్చిపోయిన కామాంధులు
  • స్నానం చేస్తున్న మహిళను లాక్కొచ్చి అత్యాచారం
  • వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టిన నిందితులు
కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఘటన సర్వత్ర చర్చనీయాంశమైంది. సకల పాపాలను హరించి వేస్తుందని చెప్పే పవిత్ర గంగానది ఒడ్డునే పాపకార్యం జరిగింది. నదిలో స్నానం చేస్తున్న మహిళను బయటకు లాక్కొచ్చిన కొందరు దుండగులు అక్కడే అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ మొత్తం ఘటనను సెల్‌ఫోన్లలో చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టారు. సోమవారమే ఈ ఘటన జరిగినా బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. అయితే, వాట్సాప్‌లో నిందితులు షేర్ చేసిన వీడియో వైరల్ అయి చివరికి పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
River Ganga
Bihar
Rape
Bath
Police
Patna

More Telugu News