bjp: ఇంటి కిరాయి కడతాం.. వీపు గోకుతాం..!: బీజేపీపై కేసీఆర్ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
బీజేపీ అనే పార్టీ ఒకటుందని, తెలంగాణలో అదెక్కడుందో ఎవరికీ తెలియదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజామాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు ఇళ్ల కిరాయిలు కడతామని బీజేపీ నేతలు అంటున్నారని, ఇటువంటి స్కీమ్ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఎన్నికల్లో గెలవాలని ఉద్దేశంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

‘లక్ష్మణ్ గారూ.. ఇళ్ల కిరాయి కడతావు.. మీ నరేంద్ర మోదీ, అమిత్ షా 2014లో ఏం మాటలు చెప్పారు? విదేశాల్లోని నల్లధనం తెస్తామన్నారు. మనిషికి పదిహేను లక్షలు బ్యాంకులో వేస్తామన్నారు! మేము అడుగుతున్నాం.. పదిహేను లక్షలు బ్యాంకులో వెయ్.. మేమే మీ ఇంటి కిరాయి కడతాం. మీరు కట్టక్కర్లేదు. ప్రజలను గొర్రెలనుకుంటున్నారా? అమాయకులనుకుంటున్నారా? మీ ఇంటి కిరాయి కడతాం!.. స్నానం చేసినప్పుడు వీపు అందదు కాబట్టి వీపు గోకుతాం!..’ అంటూ చెబుతున్న మాటలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
bjp
kcr

More Telugu News