బిగ్ బాస్ విజేత కౌశల్ కాదన్న తేజశ్వి.. మండిపడుతున్న కౌశల్ ఆర్మీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ విజేత కౌశల్ కాదన్న తేజశ్వి.. మండిపడుతున్న కౌశల్ ఆర్మీ!

  • బిగ్ బాస్ అసలు విజేతలు వీరేనంటూ ఇతర కంటెస్టెంట్ ల ఫొటో షేర్
  • తేజశ్విపై మండిపడుతున్న కౌశల్ ఆర్మీ
  • కౌశల్ మీద పడి ఏడ్చి చచ్చిపోతోందంటూ విమర్శలు
హీరో నాని హోస్ట్ గా వ్యవహరించిన రియాల్టీ షో 'బిగ్ బాస్' సీజన్-2 నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ విజేతగా కౌశల్ నిలిచాడు. అయితే ఈ షోలో మొదటి నుంచి కూడా కౌశల్ కు వ్యతిరేకంగా ఉన్న మరో కంటెస్టెంట్ తేజశ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అమిత్, పూజ, భానుశ్రీ, రోల్ రైడ, గణేష్, శ్యామల, బాబు గోగినేనిలు ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి... అసలు విజేతలు వీరేనంటూ కామెంట్ పెట్టింది. ఈ వ్యాఖ్యలపై కౌశల్ ఆర్మీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

'పై నుంచి కింద వరకు ఈమె విషాన్ని నింపుకుంది. చాలా చీప్, స్టుపిడ్, షేమ్ లెస్. మరొకరి విజయాన్ని అభినందించలేకపోతోంది. మన కౌశల్ మీద అసూయతో ఏడ్చి చచ్చిపోతోంది. నీవు ఎప్పటికీ లూజర్ వే. ఇప్పుడు, ఎప్పటికీ కౌశలే విజేత' అంటూ కౌశల్ ఆర్మీ ట్వీట్ చేసింది.
tejaswi
madivada
bigboss
kaushal
arny

More Telugu News