ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలవడం అభినందనీయం: కేసీఆర్

  • ఆసియా కప్‌లో ఓటమెరుగని భారత్
  • కప్పును  సాధించడం పట్ల కేసీఆర్ హర్షం
  • రానున్న మ్యాచ్ లలో విజయాలు సాధించాలని ఆకాంక్ష
బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించి కప్పును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ టైటిల్ సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆసియా కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలవడం అరుదైన విజయంగా అభివర్ణించారు. భారత జట్టు అన్ని రంగాల్లో రాణించిందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచ్ లలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Go Back to Shorts
KCR
asia cup 2018
Cricket

More Telugu News