Kodandaram: కేసీఆర్ ఇంట్లో సోదాలు చేయాలి: కోదండరాం

షార్ట్స్‌లో చూడండి
రాజకీయ స్వార్థం కోసం ఐటీ, ఈడీలను ప్రభుత్వం వాడుకుంటోందని టీజేఎస్ అధినేత కోదండరామ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చాలా మంది ఇళ్లలో సోదాలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ రద్దుకు ముందు తెలంగాణలోని పరిస్థితి గురించి బీజేపీ నేత కిషన్ రెడ్డితో చర్చించానని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు అనవసరంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అక్టోబర్ 3న మెదక్ నుంచి వరంగల్ కు పోరుయాత్ర ప్రారంభమవుతుందని... 10వ తేదీన వరంగల్ లో పోరు సభను నిర్వహిస్తామని చెప్పారు. 
Go Back to Shorts
Kodandaram
KCR
tjs
TRS
poru yatra

More Telugu News