గత ఏడాది రూ. 2 లక్షలు పలికిన 'గణేశ్' లడ్డూ... ఈసారి ఏకంగా రూ. 15 లక్షలు దాటేసింది!
- ఎన్నడూ లేనంత ధర పలికిన ఫిలింనగర్ లడ్డూ
- గత ఏడాది రూ.2 లక్షలకు వేలం
- ఈ ఏడాది భారీ ధరకు సొంతం చేసుకున్న బీజేపీ నేత పల్లపు గోవర్ధన్
తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వినాయకుడి లడ్డూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. గత ఏడాది వేలంపాటలో ఈ లడ్డూ కేవలం రూ. 2 లక్షలు మాత్రమే పలికింది. ఈసారి మాత్రం ఊహించని విధంగా 15 లక్షల వెయ్యి నూటపదహారు రూపాయలు పలికింది. బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు.