మేము బయట కనిపిస్తున్నట్టుగా ఇంట్లో ఉండం: సమంత
Add ap7am to your home Screen

మేము బయట కనిపిస్తున్నట్టుగా ఇంట్లో ఉండం: సమంత

  • ఇప్పుడు మారిపోయాను 
  • ఇంట్లో సైలెంట్ గానే వుంటాను 
  • చైతూను 'బేబీ' అని పిలుస్తాను
అందాల కథానాయికగానే కాదు .. అందమైన మనసున్న మనిషిగా కూడా సమంతకి మంచి పేరుంది. అయితే ఆమెకి కాస్త షార్ట్ టెంపర్ ఉందనేవారు కూడా లేకపోలేదు. ఇదే విషయాన్ని గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆలీ ప్రస్తావించాడు. అప్పుడు సమంత స్పందిస్తూ .. "ఈ మధ్యకాలంలో నేను మారిపోయాను. నా షార్ట్ టెంపర్ మొత్తాన్ని చైతూ తగ్గించేశాడు.

నిజం చెబుతున్నాను ... ఇంట్లో అప్పర్ హ్యాండ్ ఆయనదే. బయట జనాలకి కనిపించేలా చైతూ ఇంట్లో వుండడు .. ఇంట్లో పరిస్థితి రివర్స్ ఉంటుంది. బయట నేను ఎక్కువగా మాట్లాడేస్తూ .. అల్లరి చేస్తూ కనిపిస్తాను గానీ, ఇంట్లో మాత్రం సైలెంటే. ఆయన చాలా క్యూట్ గా ఉంటాడు కనుక, ఇంట్లో ఆయనను నేను 'బేబీ' అని పిలుస్తూ వుంటాను" అంటూ నవ్వేసింది.     
samanta
ali

More Telugu News