kondagattu: ఘోరం జరిగిపోయాక దిద్దుబాటు.. కొండగట్టు ఘాట్‌లో భారీ వాహనాల నిషేధం

షార్ట్స్‌లో చూడండి
ఘోరం జరిగిపోయింది. అరవై మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీరుబాటుగా ఇప్పుడు అధికారులు మేలుకున్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కొండగట్టు ఘాట్‌ రోడ్డులో భారీ వాహనాలను నిషేధిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్‌ రోడ్డులో ఇటీవల ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోను, ఆస్పత్రిలోనూ అరవై మందికి పైగా చనిపోయారు. ఈ రోడ్డు ప్రమాద హేతువని ఎప్పటి నుంచో ప్రయాణికులు మొత్తుకుంటున్నా అధికారులు స్పందించలేదు. చివరికి జరగరానిది జరిగాక స్పందించారంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Go Back to Shorts
kondagattu
Jagtial District
Telangana
KCR

More Telugu News