mahakutami: మహాకూటమిలో చేరడానికి కోదండరామ్ అంగీకరించారు: ఎల్ రమణ

షార్ట్స్‌లో చూడండి
ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వనాశనం చేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల మధ్య పొత్తు కుదిరిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరామ్ పార్టీ టీజేఎస్ కూడా కూటమిలో చేరుతోందని చెప్పారు. మహాకూటమిలో చేరేందుకు కోదండరామ్ అంగీకరించారని తెలిపారు. కూటమిలో చేరుతున్నందుకు కోదండరామ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కొండగట్టులో అంతమంది ప్రాణాలు కోల్పోతే, కనీసం చూసేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని విమర్శించారు.
Go Back to Shorts
mahakutami
kcr
kodandaram
l ramana

More Telugu News