క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోలింగ్ వుడ్
- 2010-11లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు
- అనంతరం డొమెస్టిక్ క్రికెట్, కోచింగ్ కు పరిమితం
- నా శక్తి చివరి భాగాన్ని కూడా క్రికెట్ కే అందించానన్న కోలింగ్ వుడ్
తన రిటైర్మెంట్ పై కోలింగ్ వుడ్ మాట్లాడుతూ, ఈ సీజన్ ముగిసిన తర్వాత రిటైర్ అవుదామని చాలా కాలంగా ఆలోచించానని చెప్పాడు. ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన నిర్ణయమని, కానీ, ఈ నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. తన శక్తిలో చివరి భాగాన్ని కూడా క్రికెట్ కే అందించడం సంతోషంగా ఉందని చెప్పాడు.