komatireddy: టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు.. పొత్తెందుకు?: కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై మరోసారి ఆలోచించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా గెలుపొందుతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. తెలుగుదేశంతో పొత్తుపై రాహుల్ గాంధీకి వివరిస్తానని చెప్పారు. మహాకూటమిలోని ఇతర పార్టీలను పది సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు.
Go Back to Shorts
komatireddy
kcr
Telugudesam
congress

More Telugu News