డిసెంబరులో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో ఎవరికి తెలుసు?: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
- డిసెంబరులో ఎవరి అవసరం ఎవరికి ఉంటుందో
- కర్ణాటకలో కుమారస్వామి సీఎం కాలేదా?
- ఇక్కడ కూడా అలా ఎందుకు కాకూడదు
నవంబరులో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబరులో తాను సీఎంను అవుతానని కేసీఆర్ చెబుతున్నారని.. నవంబరులో ఎన్నికలు నిజమే అయినా, డిసెంబరులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. డిసెంబరులో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో ఎవరికి తెలుసని పేర్కొన్నారు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అవగా లేనిది, మజ్లిస్ నుంచి ఒకరు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. డిసెంబరు వరకు వేచి చూద్దామని, ఎవరి అవసరం ఎవరికి వస్తుందో తేలిపోతుందని పేర్కొన్నారు.