Pawan Kalyan: తెలంగాణ శాసనసభ రద్దుపై జనసేన పార్టీలో విస్తృత చర్చ!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ తొలి శాసనసభ రద్దయిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పరిణామాలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) సుదీర్ఘంగా చర్చించింది. ఈరోజు హైదరాబాద్.. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో వివిధ రాజకీయపక్షాలు, రాజకీయ కూటముల బలాబలాలను ప్యాక్ బేరీజు వేసింది. తెలంగాణలో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై ఒక నివేదిక రూపొందించి పార్టీ అధ్యక్షుడుకి సమర్పించాలని కమిటీ నిర్ణయించింది.

శనివారం లేదా ఆదివారంనాడు పార్టీ అధ్యక్షునితో జరిగే సమావేశంలో ఈ నివేదికపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో జనసేన పార్టీతో కలసి పనిచేయాలని సీపీఎం పార్టీ అభిలాషను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ వ్యవహారాల కమిటీతో తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో సీపీఎం నేతలు జరిపిన సమావేశం వివరాలను ప్యాక్ విశ్లేషించింది. ఆ సమావేశం వివరాలు, ప్యాక్ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షునికి సమర్పించాలని సమావేశం నిర్ణయించింది.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Telangana
Hyderabad

More Telugu News