డబ్బు కాజేశానని నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా: నటుడు శివాజీ రాజా
- గత మూడు రోజులుగా వివాదం
- డబ్బు కాజేశారని శివాజీ రాజా, శ్రీకాంత్ లపై ఆరోపణలు
- ఖండించిన నటులు
కాగా, ఇటీవల అమెరికాలో 'మా' సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్టు వార్తలు రావడంతో దుమారం మొదలైంది. గడచిన మూడు రోజులుగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ లో పంచాయతీలు జరుగుతూ ఉండగా, నటుడు, 'మా' కార్యదర్శి నరేష్, ఆఫీసుకు తాళం వేయడంతో పరిస్థితి మరింతగా ముదిరింది. ఆపై అత్యవసర సమావేశం జరిపి, శివాజీ రాజా వివరణ తీసుకున్న తరువాత, వివాదం సద్దుమణిగిందన్న ప్రకటన వెలువడినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఇదే విషయమై స్పందించిన శ్రీకాంత్, ఒక్క రూపాయిని తాను వాడుకున్నట్టు నిరూపించినా, 'మా' కార్యాలయంలో అడుగు పెట్టబోనని, సభ్యత్వానికి శాశ్వతంగా రాజీనామా చేస్తానని అన్నారు.