కేంద్ర మంత్రి హెగ్డేకు కడప ‘ఉక్కు’ సెగ.. మంత్రి కారుపై బూటు విసిరినా మహిళా కార్యకర్త!
- మంత్రి కారును అడ్డుకున్న కమ్యూనిస్టులు
- కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు డిమాండ్
- మంత్రి కనీసం కారు దిగకపోవడంపై ఆగ్రహం
కడప ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంత కుమార్ హెగ్డే కదలకుండా లోపలే ఉండిపోయారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే పోలీసులు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను పక్కకు లాగి పడేశారు. కనీసం తమ గోడును వినకుండా మంత్రి ముందుకెళ్లడంతో ఆగ్రహానికి లోనైన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారును వెంబడించి మరీ బూటును విసిరారు.