జూ.ఎన్టీఆర్ బాధను అర్థం చేసుకోగలను.. నేనూ మా అమ్మను పోగొట్టుకున్నా!: భూమిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూ.ఎన్టీఆర్ బాధను అర్థం చేసుకోగలను.. నేనూ మా అమ్మను పోగొట్టుకున్నా!: భూమిక

  • షాక్ కు గురైనట్లు తెలిపిన నటి
  • ఏనాడూ హరికృష్ణను కలుసుకోలేదన్న భూమిక
  • నందమూరి కుటుంబానికి శక్తినివ్వాలని ప్రార్థన 
నందమూరి హరికృష్ణ చనిపోవడంపై నటి భూమిక చావ్లా స్పందించింది. హరికృష్ణ ప్రమాదంలో చనిపోయినట్లు తెలియగానే తాను షాక్ కు గురయ్యానని తెలిపింది. జూ.ఎన్టీఆర్ తండ్రిగారిగా మాత్రమే హరికృష్ణ తనకు తెలుసనీ, ఆయన్ను ఏనాడూ కలుసుకోలేదని వెల్లడించింది. జూ.ఎన్టీఆర్ అనుభవిస్తున్న తీవ్రమైన బాధను తాను అర్థం చేసుకోగలననీ, తన తల్లి కూడా ఈ మధ్యనే చనిపోయారని భూమిక చెప్పింది. నందమూరి కుటుంబానికి దేవుడు శక్తిని ఇవ్వాలని ఆమె ప్రార్థించింది.

ఈ రోజు భూమిక ట్విట్టర్ లో స్పందిస్తూ..‘జూ.ఎన్టీఆర్ నాన్నగారు సడెన్ గా చనిపోయారని తెలియగానే నిజంగా షాక్ కు గురయ్యా. హరికృష్ణ గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. కానీ ఎన్టీఆర్ ఎంత బాధ అనుభవిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా ఇటీవలే మా అమ్మను కోల్పోయాను. నందమూరి కుటుంబానికి దేవుడు ఈ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలి’ అని ట్వీట్ చేసింది. భూమిక ఎన్టీఆర్ తో కలసి సింహాద్రి, సాంబా చిత్రాల్లో నటించింది.
harikrishna
ntr
Hyderabad
bhumika
tweet

More Telugu News