రోజా విషయంలో నేను చెప్పినట్టుగానే జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ
- 'సర్పయాగం'లో రోజా చేసింది
- 'సీతారత్నం గారి అబ్బాయి' సూపర్ హిట్
- 'ముఠామేస్త్రి'తో వెనుతిరిగి చూసుకోలేదు
'సర్పయాగం' తరువాత రోజా 'సీతారత్నం గారి అబ్బాయి' .. 'ముఠామేస్త్రి' సినిమాలు చేసింది. ఈ సినిమాలతో రోజా ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ తను వరుస సినిమాలు చేస్తోంది. ఆ సమయంలో వెంకటేశ్ తో 'పోకిరి రాజా' సినిమాను గద్వాల్ రెడ్డి గారు నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. హీరోయిన్ గా రోజా అయితే బాగుంటుందని భావించిన ఆయన, రామానాయుడి గారితో ఫోన్ చేయించారు. నిజంగానే బిజీగా ఉండటం వలన తన డేట్స్ లేవని రోజా చెప్పింది. దాంతో నాయుడు గారు నాకు చెబితే .. నేను రోజాను ఒప్పించాను" అని చెప్పుకొచ్చారు.