భారీ రేటుకు 'యూ టర్న్' తెలుగు రాష్ట్రాల హక్కులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ రేటుకు 'యూ టర్న్' తెలుగు రాష్ట్రాల హక్కులు

  • సమంత ప్రధాన పాత్రగా 'యూ టర్న్'
  • కీలకమైన పాత్రలో భూమిక
  • వచ్చేనెల 13వ తేదీన విడుదల  
కన్నడలో 2016లో వచ్చిన 'యూ టర్న్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా కన్నడలో పవన్ కుమార్ కి మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో అదే దర్శకుడితో .. అదే టైటిల్ తో తెలుగులోకి ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రను పోషించింది. భూమిక .. ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ ముఖ్యమైన పాత్రలను చేశారు.

ఇది ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుందనే టాక్ రావడంతో బిజినెస్ విషయంలో సందేహాలు తలెత్తాయి. కానీ సమంతకు గల క్రేజ్ కారణంగా .. కంటెంట్ లోని గ్రిప్ కారణంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శివమ్ సెల్యులాయిడ్ ఈ హక్కులను దక్కించుకుందని అంటున్నారు. 'వినాయకచవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    
samanta
bhumika

More Telugu News