బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. మరో రెండు రోజులు వానలే!
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.