సల్మాన్ కెమేరాలో చిక్కిన బాలీవుడ్ కమెడియన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సల్మాన్ కెమేరాలో చిక్కిన బాలీవుడ్ కమెడియన్!

  • సల్మాన్ తీసిన సునీల్ గ్రోవర్ ఫోటో వైరల్ 
  • అగ్రకథానాయకుడు షారూఖ్ ఖాన్ తో పోలిక
  • 'భారత్' సినిమా షూటింగులో ఆర్టిస్టుల ఆటవిడుపు 
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలీవుడ్ అగ్రహీరో ఎవరో తెలుసా... కమెడియన్ సునీల్ గ్రోవర్. అదేంటి? అని ఆలోచిస్తున్నారా... అవును 'భారత్' సినిమా షూటింగ్ సమయంలో మన కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇదే సినిమాలో నటిస్తున్న సునీల్ గ్రోవర్ ని ఓ ఫోటో తీశాడు.

సునీల్ బనియన్ ధరించి పోజులిచ్చిన ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేం, నెటిజన్లు సునీల్ అచ్చం బాలీవుడ్ అగ్రహీరో షారూఖ్ ఖాన్ లా వున్నాడని కితాబిచ్చేశారు. దీంతో సునీల్ గ్రోవర్ స్పందిస్తూ, 'త్వరలోనే ఫైనల్ ఫోటోలు షేర్ చేస్తాను. భారత్ షూటింగ్ లో తీసిన ఈ ఫోటోలు ఫొటోగ్రాఫిక్ యాంగిల్ లో వున్నాయి' అని పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ ఫోటో అంతగా వైరల్ అవ్వటానికి కారణం మాల్టాలో 'భారత్' షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ కండలవీరుడు సల్లూభాయ్ సునీల్ గ్రోవర్ ని ఫోటో తీయడమేనేమో!
Sunil Grover
Shah Rukh Khan

More Telugu News