దేశం విడిచి వెళ్లకపోతే రోహింగ్యా ముస్లింలను కాల్చి చంపండి: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- పాతబస్తీలో రోహింగ్యాలు భారీ సంఖ్యలో ఉన్నారు
- రాజ్ నాథ్ సింగ్, కేసీఆర్ లు వీరిని తరిమికొట్టాలి
- రోహింగ్యాలు టెర్రరిస్టులకు అనుకూలంగా ఉంటారు
హైదరాబాదులో కూడా భారీ సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు అక్రమంగా నివసిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పారు. రోహింగ్యాలకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్థికంగా సాయం చేస్తున్నారని ఆరోపించారు. రోహింగ్యా ముస్లింలంతా టెర్రరిస్టులకు అనుకూలంగా ఉంటారని చెప్పారు. భారతదేశం, తెలంగాణ సురక్షితంగా ఉండాలంటే... కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లు ... వీరిని దేశం నుంచి తరిమికొట్టాలని కోరారు. ఒకవేళ ఆ పనిని చేయకపోతే... దేశానికి వీరు ప్రమాదకరంగా మారుతారని చెప్పారు.