కోపంతో దర్శకుడు భారతీరాజా నన్ను కొట్టేశారు: అలీ
- క్లైమాక్స్ సీన్ తీస్తున్నారు
- ఆ సీన్లో మేమంతా నవ్వుతున్నాం
- కెమెరామెన్ ఆ సంగతి దర్శకుడికి చెప్పేశాడు
ఆ రోజున క్లైమాక్స్ సీన్ ను రెండు రకాలుగా చిత్రీకరిస్తున్నారు. మేమంతా ఏదో జోక్ చేసుకుని నవ్వుతూ వుంటే, సీరియస్ సీన్లో మేము నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నామని భారతీరాజా గారికి కెమెరా మేన్ చెప్పేశాడు. ఆయన కోపంగా వచ్చి అందరినీ ఫట్ ఫట్ ఫట్ మంటూ కొట్టేసి నన్ను మాత్రం రెండుసార్లు కొట్టారు. బ్రేక్ లో నేను ఏడుస్తూ కూర్చుంటే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు వచ్చి ఏమైందని అడిగారు. 'డైరెక్టర్ గారు కొట్టారండీ' అంటూ మళ్లీ ఏడవడం మొదలుపెట్టాను. ఊరుకోమని చెబుతూ జేబులో నుంచి రెండు వందలు తీసి ఇచ్చారు" అంటూ నవ్వేశారు.