china rajappa: కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన చినరాజప్ప

షార్ట్స్‌లో చూడండి
కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అందుకే, ఆ అంశంపై తాను హామీ ఇవ్వలేనని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపుల పట్ల జగన్ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. తమకు రాజ్యాంగ పరిమితులు తెలుసు కనుకనే ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అన్నారు. కాపు రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి వుందని, కాపులపై జగన్ కు సానుభూతి ఉంటే కేంద్రంపై పోరాడి ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయించాలని అన్నారు. 
Go Back to Shorts
china rajappa
jagan

More Telugu News