Jagan: వందో నియోజకవర్గంలో 100 కిలోల కేక్ కట్ చేసిన జగన్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వందో నియోజకవర్గంలోకి ఈరోజు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం దాటి జగ్గంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా వంద కిలోల కేక్ ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ కు అభినందనలు తెలిపారు.

అంతకుముందు, తిమ్మాపురంలో జగన్ ని ఓ జంట కలిసింది. తమ చిన్నారికి పేరు పెట్టాలని జగన్ ని కోరారు. ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకున్న జగన్, ఆ చిన్నారికి ‘విజయమ్మ’ అని నామకరణం చేశారు. జగన్ తన తల్లి పేరును తమ చిన్నారికి పెట్టడంపై ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.   
Go Back to Shorts
Jagan
jaggampet

More Telugu News