ముందీ విషయం చెప్పండి.. అఖిలేశ్ నాయకత్వంలో మాయావతి పనిచేస్తారా?: యూపీ సీఎం సూటి ప్రశ్న
- ఎస్పీ-బీఎస్పీలది బుర్ర తక్కువ సంకీర్ణం
- రాహుల్ నాయకత్వంలో అఖిలేశ్ పనిచేస్తారా?
- ఎవరు వచ్చినా యూపీలో బీజేపీని ఏమీ చేయలేరు
అఖిలేశ్ నాయకత్వంలో మాయావతి పనిచేస్తారా? అన్నదే ఆ ప్రశ్న అన్నారు. అలాగే, రాహుల్ నాయకత్వంలో అఖిలేశ్ పనిచేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీని చూసి వారు భయపడుతున్నారని, వారి ఉనికిని కాపాడుకునేందుకు ఒకరికొకరు దగ్గరవుతున్నారని యోగి విమర్శించారు. ఎంతమంది కలిసినా యూపీలో వారేమీ చేయలేరని తేల్చి చెప్పారు. ఒకరితో ఒకరు చేతులు కలుపుతున్నా, ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో మరోమారు విజయ ఢంకా మోగిస్తామని యోగి స్పష్టంచేశారు.