china rajappa: ఏపీ మంత్రి చినరాజప్ప, ఆయన కుమారుడిపై జగన్ ఆరోపణలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి చినరాజప్ప, ఆయన కుమారుడిపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఆనూరుమెట్ట గ్రావెల్ మాఫియా వెనుక చినరాజప్ప, ఆయన కుమారుడి ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఈ జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయని, పెద్దాపురం పరిసరాల్లో ఇటీవల జరిగిన ఆరు హత్యలే నిదర్శనమని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడి పైనా తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి యనమల వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చారని, చంద్రబాబు పోలవరం వెళ్లేది కమీషన్ల కోసమేనని జగన్ ఆరోపించారు.
Go Back to Shorts
china rajappa
jagan

More Telugu News