బాలీవుడ్ ఎంట్రీకి శ్రీదేవి చిన్నకుమార్తె కూడా రెడీ!

  • నటి కావాలని ఖుషీ కోరుకుంటోందన్న బోనీ కపూర్
  • ఆమె నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా
  • జాన్వీకి కూడా ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చా
శ్రీదేవి, బోనీకపూర్ ల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తన తొలి సినిమా 'ధడక్'తో బాలీవుడ్ కెరీర్ ను ఘనంగా ప్రారంభించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సందడి చేస్తోంది. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ స్వయంగా తెలిపాడు.

సినీరంగంలోకి రావాలని జాన్వీకి తాను ఎన్నడూ సూచించలేదని... తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను తాను ఇచ్చానని బోనీ చెప్పారు. తన కుమారుడు అర్జున్ కపూర్ కు నటుడు అవ్వాలనే కోరిక ఉందనే విషయం... సల్మాన్ ఖాన్ తనతో చెప్పేంత వరకు తనకు తెలియదని అన్నారు. తన పెద్ద కుమార్తె అన్షులా (తొలి భార్య కుమార్తె) పూర్తిగా చదువుపైనే దృష్టి సారించిందని చెప్పారు. ఖుషీ విషయానికి వస్తే... తొలుత మోడల్ కావాలనే ఆలోచనతో ఉండేదని, ఇప్పుడు నటి కావాలని కోరుకుంటోందని తెలిపారు. సినిమాల్లోకి రావాలని ఖుషీ కోరుకుంటే... ఆమె నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని చెప్పారు. బోనీ మాటల నేపథ్యంలో ఖుషీ బాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఉండబోతోందని బీ-టౌన్ లో ప్రచారం జరుగుతోంది.
Go Back to Shorts
bollywood
sridevi
janvi kapoor
khushi kapoor
boni kapoor

More Telugu News