క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ!
- ఓటమికి భార్యలే కారణమంటూ విమర్శలు
- భార్యలు, ప్రియురాళ్లను పక్కనబెట్టండి
- ఆటగాళ్లకు బీసీసీఐ ఆదేశం
ఇటీవలి వన్డే సిరీస్ ఓటమి తరువాత క్రికెటర్లు తమ భార్యా పిల్లలతో కలసి టూర్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. వీరు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతుంటే ట్రోలింగ్ కూడా జరిగింది. ఓటమి తరువాత వీళ్లు ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. ఇక టెస్టు సిరీస్ లోనూ భారత్ ఓటమి పాలైతే విమర్శల తీవ్రత మరింతగా పెరుగుతుందన్న ఆందోళనలో ఉన్న బీసీసీఐ, ముందుజాగ్రత్తగా టెస్టు మ్యాచ్ ల వరకూ జీవిత భాగస్వాములను దూరం పెట్టాలని ఆదేశించింది.