బిగ్‌బాస్-2లో నాటకీయ పరిణామాలు.. మళ్లీ టార్గెట్ అయిన కౌశల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్-2లో నాటకీయ పరిణామాలు.. మళ్లీ టార్గెట్ అయిన కౌశల్

  • నామినేట్ అయిన కౌశల్
  • ఎలిమినేట్ అయిన వారిలో మళ్లీ ఒకరికి చాన్స్
  • ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించినట్టు చెప్పిన బిగ్‌బాస్
బిగ్‌బాస్-2 ప్రారంభం నుంచి టార్గెట్ అవుతూ వస్తున్న కౌశల్ హౌస్‌లోని తోటి సభ్యులకు మళ్లీ టార్గెట్‌గా మారాడు. ఎలిమినేషన్ టాస్క్‌లో భాగంగా మిగతా సభ్యులందరూ కౌశల్‌ను టార్గెట్ చేసి అతడి నెత్తిపై గుడ్లు పగలగొట్టారు. అమిత్‌, రోల్‌ రైడా, తనీష్‌, నందిని, బాబు గోగినేని, గణేష్‌లు కౌశల్‌పై గుడ్లు పగలగొట్టారు. దీంతో కౌశల్ నామినేషన్‌లోకి వెళ్లిపోయాడు. కౌశల్ తన వంతు వచ్చినప్పుడు  నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు.  

షోలో అంతకుముందు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనను ఎలిమినేషన్ నుంచి కాపాడినట్టు కౌశల్ పదేపదే గుర్తుచేస్తూ హింసిస్తున్నాడని కౌశల్‌పై నందిని ఇంటి సభ్యులకు ఫిర్యాదు చేసింది. నామినేషన్ సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించి కౌశల్ తలపై గుడ్లు పగలగొట్టింది. కాగా, సోమవారం అర్ధరాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరో ఓ కొత్త వ్యక్తి ప్రవేశించడం కనిపించింది. అయితే, అది ఎవరన్నది నేడు తెలియనుంది.

కౌశల్ తర్వాత నామినేట్ అయినవారిలో బాబు గోగినేని,  దీప్తి సునయన, గణేశ్ ఉన్నారు. షో చివర్లో బిగ్ బాస్ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు చెప్పాడు. అయితే, తేజస్విని మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చేందుకే ఈ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Big Boss
Star Maa
Kaushal
Tejaswi

More Telugu News