బ్యాంకుల నుంచి నిరసనలు తలెత్తడంతో.. నాగార్జున యాడ్ ను ఉపసంహరించుకున్న కల్యాణ్ జువెల్లర్స్!
- బ్యాంకులపై నమ్మకాన్ని పోగొట్టేలా యాడ్
- చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఏఐబీవోసీ హెచ్చరిక
- అన్ని ప్రసార మాధ్యమాల నుంచి యాడ్ తొలగింపు
ఈ యాడ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఏఐబీవోసీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, కల్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణరామన్, మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యాడ్ ను కేవలం ప్రచారం కోసం మాత్రమే రూపొందించామని, అయితే దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు తెలిపారని ఆయన అన్నారు.
తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూ, ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని చెప్పారు.