Nara Lokesh: జగన్‌కు లోకేశ్ కౌంటర్.. చంద్రబాబు పోరాటాలను గుర్తు చేసిన మంత్రి

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబు తన 40 ఏళ్ల  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడైనా పోరాటం చేశారా? అన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చాలా ప్రజా పోరాటాలు చేశారని పేర్కొన్నారు. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైనది మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతిపై చేసిన పోరాటమని అన్నారు. కేవలం జగన్ దురాశ కారణంగానే అవినీతి జరిగిందని ఆరోపించారు. క్విడ్‌ ప్రోకో, హత్యలు, దోపిడీలు, కిడ్నాపులు, భూకబ్జాలు, జైలులో హత్యలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు. చంద్రబాబు అన్నింటిపైనా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.  

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాతి రోజు జగన్ మీడియా సమావేశం పెట్టి చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ పోరాటం చేసి ఎరుగరని విమర్శించారు. జగన్ ఆరోపణలపై స్పందించిన లోకేశ్ ఇలా ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News