త్రిష మళ్లీ భయపెట్టడానికి వచ్చేస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిష మళ్లీ భయపెట్టడానికి వచ్చేస్తోంది

  • హారర్ చిత్రాలపై ఆసక్తి చూపుతోన్న త్రిష 
  • గతంలో వచ్చిన 'కళావతి' .. 'నాయకి'
  • తాజాగా థియేటర్లకు రానున్న 'మోహిని'
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగిన త్రిష, ఇటీవల నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఎక్కువగా చేస్తోంది. నయనతార మాదిరిగా హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడానికి కూడా ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇంతకుముందు 'కళావతి' .. 'నాయకి' వంటి హారర్ థ్రిల్లర్ సినిమాలు చేసిన త్రిష, తాజాగా హారర్ కామెడీ నేపథ్యంలో సాగే 'మోహిని' సినిమా చేసింది.

తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన 'మోహిని'కి మాదేష్ దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా .. క్లీన్ యు సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఈ సినిమాకి త్రిష నటన హైలైట్ గా నిలుస్తుందనీ, ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోతుందని అన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
trisha

More Telugu News