పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభుదేవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభుదేవా

  • నిర్మాతగా ప్రభుదేవా బిజీ 
  • నటుడిగా విభిన్నమైన పాత్రలు 
  • పురాతన విగ్రహాల చోరీ నేపథ్యంలో సాగే కథ     
ఆ మధ్య వరుసగా హిందీ సినిమాలకి దర్శకుడిగా పనిచేస్తూ వచ్చిన ప్రభుదేవా, ఇటీవల తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టాడు. ఒక వైపున నిర్మాతగా కొనసాగుతూనే, మరో వైపున నటుడిగా విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడు. అలా తాజాగా ఆయన తమిళంలో 'పొన్ మాణిక్య వేల్' అనే సినిమాలో టైటిల్ రోల్ ను పోషిస్తున్నాడు.

గతంలో ప్రభుదేవా దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన ఏసీ ముగిల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. తొలిసారిగా ప్రభుదేవా ఈ సినిమాలో పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. చోరీకి గురైన పురాతన విగ్రహాలను గుర్తించి .. తిరిగి రాష్ట్రానికి తీసుకురావడంలో పోలీస్ ఆఫీసర్ పొన్ మాణిక్యవేల్ ఎంతో కృషి చేశారు. ఆయన పాత్ర ప్రధానంగానే ఈ సినిమా రూపొందుతోందని అంటున్నారు.   
prabhudeva
niveda peturaj

More Telugu News